VIDEO: అరసవల్లిలో వైభవంగా తెప్పోత్సవం

VIDEO: అరసవల్లిలో వైభవంగా తెప్పోత్సవం

SKLM: అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. హంసవాహనంపై స్వామివారిని అలంకరించి ఇంద్రపుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. దీంతో భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గొండు శంకర్, ఆలయ ఈవో, అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు.