VIDEO: భోజనం వడ్డించిన వల్లభనేని
కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని నిడమానూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఇంఛార్జ్ వల్లభనేని వంశీ మోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో వంశీ స్వయంగా ప్రజలకు అన్నం వడ్డించారు.