వామన్ రావు కేసు.. విచారణకు మాజీ MLA
TG: హైకోర్ట్ అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణకు ఇవాళ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హాజరుకానున్నారు. రామగుండం కమిషనరేట్‌లో ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా ఇప్పటికే మృతుడు వామన్ రావు తండ్రి కిషన్ రావుతో పాటు, వారి కుటుంబీకులు, బంధువులు, పలువురిని అధికారులు విచారించిన విషయం తెలిసిందే.