ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
అన్నమయ్య: అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాయచోలో టీడీపీ నాయకుడు సుగవాసి ప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగం సమాన హక్కులకు పునాది అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.