VIDEO: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

KDP: కమలాపురం నగర పంచాయతీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రైల్వే గేటు సమీపంలో ట్రాక్టర్, స్కూటర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాంనగర్‌కు చెందిన ఓ మహిళ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న కమలాపురం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.