విజయవాడలో 79 మందికి భారీ జరిమానా

విజయవాడలో 79 మందికి భారీ జరిమానా

కృష్ణా: విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రదేశాలలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 79 మందిని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి లెనిన్ బాబు 14మందికి ఒక్కొక్కరికి రూ.15వేలు, మిగిలిన 65 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు.