VIDEO: ప్రత్యేక అలంకారంలో శ్రీ సూగుటూరు గంగమ్మ

CTR: పుంగనూరు 22వ వార్డు బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి శిలా విగ్రహానికి ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. ఆ ప్రాంతవాసులు, గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు.