VIDEO: 'హద్దులు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయండి'
ప్రకాశం: కనిగిరి, కంభం మార్గంలో హనుమంతునిపాడు మండల పోలీస్ స్టేషన్ పరిధి హద్దులను చూపించేందుకు పోలీస్ శాఖ బోర్డును గతంలో ఏర్పాటు చేశారు. రోడ్డు నిర్మాణం చేసే క్రమంలో ఈ బోర్డును తొలగించి పక్కన పడవేశారు. దీంతో హద్దులు తెలిపే బోర్డు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బోర్డును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు.