యువకుల గల్లంతు.. ఇళ్లలో విషాదం

యువకుల గల్లంతు.. ఇళ్లలో విషాదం

ASR: జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు విచ్చేసే యువత గల్లంతు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జలపాతాల్లో దిగొద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నా, స్నానాలకు దిగడం ప్రాణాలకు భారమవుతోంది. మోతుగూడెం PS పరిధిలో ఈ నెల 21న ఏలూరు యువకుడు జగదేశ్వరరావు, 23న విజయవాడకు చెందిన సందీప్ నీటిలో మునిగి మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.