అష్ట కాలభైరవ స్వామి ఆలయ వార్షికోత్సవం
మెదక్ మండలం కాజిపల్లి గ్రామంలోని శ్రీ అష్ట కాలభైరవ స్వామి 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే వార్షికోత్సవ వేడుకలలో బుధవారం గణపతి హోమం, సుప్రభాతం, అఖండ దీపారాధన, త్యాగశాల ప్రవేశం, మహా నివేదన, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హజరయ్యారు.