అంగన్వాడీ కేంద్రాల్లో ECCE డే
WGL: దుగ్గొండి మండలంలోని రేఖంపల్లి అంగన్వాడి కేంద్రంలో శనివారం ECCE డే సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అంగన్వాడీ సూపర్‌వైజర్ బోట్ల జయరాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. ప్రతి నెల ECCE డే నిర్వహించడం ద్వారా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు నేర్చుకున్న ఆటలు, పాటలు, విద్యను తల్లిదండ్రులకు తెలుపవచ్చని అన్నారు.