జమ్మూ పాఠశాలలో విద్యార్థులకు మాక్ డ్రిల్

జమ్మూ విభాగంలోని ఒక స్కూల్‌లో విద్యార్థులకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి సందర్భంగా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు పిల్లలకు శిక్షణ ఇచ్చారు. కాగా, దేశవ్యాప్తంగా రేపు మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.