రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
PLD: వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు సంగం డైరీ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అతివేగంగా వచ్చిన ఐషర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.