మైనర్‌తో పెళ్లి.. ఇద్దరు వరులు పోటీ!
యూపీలో ఒక మైనర్ బాలికను పెళ్లాడేందుకు ఇద్దరు వరులు బరాత్‌తో రావడం కలకలం రేపింది. షామ్లీ, మీరట్లకు చెందిన వరులు బరాత్‌తో పెళ్లి కూతురి ఇంటికి వెళ్లారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విచారణలో బాలిక మైనర్ అని తేలడంతో అధికారులు పెళ్లిని నిలిపివేసి, ఆమెను రక్షణ కేంద్రానికి తరలించారు. ఈ వింత ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.