వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి
MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల గుద్దేటి బజార్, సోమవారం కానుగు విత్తనాల సేకరణకు వెళ్లినప్పుడు వడదెబ్బకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అతన్ని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.