తాడేపల్లిగూడెంలో ముగ్గురు అరెస్ట్

తాడేపల్లిగూడెంలో ముగ్గురు అరెస్ట్

W.G: ఒంటరిగా బస్సు కోసం వేచి చూసేవారిని కిరాయి తీసుకుని డ్రాప్ చేస్తామని నమ్మించి దారి దోపిడికి పాల్పడిన ముగ్గురు నిందితులను తాడేపల్లిగూడెం టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఫిర్యాదు మేరకు ఏలూరు రోడ్డులో జగదీష్, సంతోష్, హర్ష కుమార్‌ను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3,15,000 విలువ చేసే బంగారం సీజ్ చేశారు.