తోకలపల్లిలో రైతులు - అటవీశాఖ మధ్య ఉద్రిక్తత
ELR: నిడమర్రు మండలం తోకలపల్లిలో రైతులు - అటవీశాఖ మధ్య ఉద్రిక్తత చెలరేగింది. పూర్వ నుంచి సాగుచేస్తున్న భూముల్లో వ్యవసాయం నిలిపివేయాలని ఫారెస్ట్ అధికారులు అడ్డగించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీ ఫామ్’ పత్రాలు చూపిస్తూ రైతులు ఆందోళన చేశారు. మూడునెలల పంటకైనా అనుమతి ఇవ్వకుండా ఆపడం అన్యాయమని వారు వ్యాఖ్యానించారు.