VIDEO: సీపీఎం గ్రామ కార్యదర్శి అరెస్ట్
MHBD: తొర్రూర్(M) కంఠాయపాలెం CPM గ్రామ కార్యదర్శి మర్క సాంబయ్యను ఇవాళ తెల్లవారుజామున పోలీస్ అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్‌లను పంపిణీ చేయాలని ఉద్యమం చేసిన నేపథ్యంలో అరెస్టు జరిగినట్లు సమాచారం. ఆయనతోపాటుగా మరో ఐదుగురు CPM పార్టీ మండల నాయకులను అరెస్టు చేసినట్లుగా స్థానిక CI వెల్లడించారు. ఎన్నికల వేళ CPM నాయకుల అరెస్ట్ స్థానికంగా చర్చనీయాంశమైంది.