VIDEO: 'చెత్తను కాలిస్తే క్రిమినల్ కేసులు తప్పవు'
AKP: చెత్తను ఎవరైనా కాలిస్తే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని, దీనిని కలెక్టర్ హెచ్చరించారని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో చెత్తకుప్పలు లేకుండా చూడాలని సూచించారు. చెత్తను ఎప్పటికప్పుడు సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.