సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గుంటూరు: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆపదలో ఉన్న వారికి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. గురజాల నియోజకవర్గంలోని అన్ని మండలాల వారికి ఈ చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.