VIDEO: పాలకొల్లులో ఈదురు గాలులు బీభత్సం

W.G. పాలకొల్లు పట్టణంలోని స్థానిక మార్టేరు రోడ్డులో ఉల్లంపర్రు దుర్గమ్మ ఆలయం వద్ద ఆదివారం కురిసిన భారీ వర్షానికి వృక్షాలు నేలకొరిగాయి. బలమైన ఈదురుగాలతో కూడిన వర్షం రావడంతో జనజీవనం స్తంభించింది. అలాగే రహదారులకు అడ్డంగా వృక్షాలు పడిపోయాయి. దీంతో అధికారులు స్పందించి వాటిని తొలగించే పనిలో పడ్డారు.