పెద్దకడబూరులో కొత్త పెన్షన్‌ల పంపిణీ

KRNL: ఎన్టీఆర్ పెన్షన్ కానుక పథకం అవ్వాతాతలకు వరంలాంటిదని మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరులో కొత్తగా మంజూరైన పెన్షన్లను టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, ఈరన్న, ఏసేపు, ఆంజనేయులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాలలోని అర్హులైన 80 మందికి స్పౌజ్ కింద మంజూరైనట్లు వెల్లడించారు.