'కావూరి సాంబశివరావు మరణ వార్త కలిచివేసింది'
VZM: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ కావూరి సాంబశివరావు మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ మంత్రిగా విశేష సేవలందించి, తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన మృతి పట్ల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.