కంచికచర్ల రహదారిపై గుంత

NTR: కంచికచర్ల పరిధిలోని ఆత్కూరు, గణాత్కూరు, కొత్తపేట గ్రామాలకు వెళ్లే రహదారిపై ప్రమాదకరమైన గుంత ఏర్పడిందని వాహనదారులు తెలిపారు. ఈ మార్గం గుండా నిత్యం వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారిపై గుంత ఏర్పడటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.