జిల్లాలో 805 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు

ప్రకాశం: ప్రాథమిక విద్యావ్యవస్థ పునఃవ్యవస్థీకరణలో భాగంగా జిల్లాలో 805 మోడల్ ప్రైమరీ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఒక్కొక్క ప్రాథమిక పాఠశాలలో 59 మంది విద్యార్థులు ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులను ఆ పాఠశాలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాలలకు ఒక HM పోస్ట్‌ను మంజూరు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.