విద్యా సంస్థల్లో ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు

VZM: ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు అధికారులను బుధవారం ఆదేశించారు. ర్యాగింగ్ వలన కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించి, అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తమ తమ పరిధిలో గల ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలను, ఇతర విద్యాలయాలను సందర్శించి అవగాహన చేపట్టాలని సూచించారు.