అలంపూర్ నియోజకవర్గానికి ఏటీసీ మంజూరు

GDWL: అలంపూర్ నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు సోమవరం జారీ చేసింది. వడ్డేపల్లి మండలం జూలకల్ గ్రామంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశ్యమని, నియోజకవర్గ ప్రజలు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.