16న కానిస్టేబుల్ నియామక పత్రాలు
AP: రాష్ట్రంలో కొత్తగా కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16న నియామక పత్రాలు అందించనున్నారు. మంగళగిరి పోలీస్ బెటాలియన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దాదాపు 6 వేల మందికి నియామక పత్రాలు అందించనుండగా.. ఈ మేరకు జరుగుతున్న ఏర్పాట్లను హోంమంత్రి అనిత నిన్న పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు అందించారు.