శానిటరీ వర్కర్లకు విధివిధానాలపై అవగాహన
VSP: సింహాచలం సిరి కల్యాణమండపంలో శానిటరీ వర్కర్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద నిర్వహించిన ఈ సందర్భంగా శానిటరీ వర్కర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చ రామురెడ్డి, కోఆర్డినేటర్ ఎం.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.