GT బ్యాటింగ్ కోచ్‌గా మాథ్యూ హేడెన్

GT బ్యాటింగ్ కోచ్‌గా మాథ్యూ హేడెన్

IPL 2026 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హెడెన్‌ను తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది. రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా, తన తరంలో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా పేరుగాంచిన హేడెన్ చేరికతో జట్టు కోచింగ్ బృందం మరింత బలోపేతమైంది.