జిల్లాలో నవోదయ పరీక్షకు సర్వం సిద్ధం

జిల్లాలో నవోదయ పరీక్షకు సర్వం సిద్ధం

NTR: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే JNVST-2026 పరీక్షకు ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,349 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్ష డిసెంబర్ 13న ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని సూచించారు.