వేసవి తాపం.. కొబ్బరి బొండాలకు భలే గిరాకీ..!
కోనసీమ: గత ఏడాది కంటే ఈసారి ఎండలు పెరిగాయి. సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ నమోదు అవుతుంది. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. డీ హైడ్రేషన్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జనం కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు. మండపేటలో కరాచీ సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు, కృష్ణా టాకీస్ రాజారత్న రోడ్డుపై బోండా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.