సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటేయాలి

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటేయాలి

విశాఖ: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని వైసీపీ జిల్లా యువ నాయకులు రాజాసాగి నారాయణమూర్తి రాజు ప్రజలను కోరారు. గురువారం రాత్రి సినిమా హాల్ సెంటర్, ఈర్ల వీధిలో ఇంటింటికి వెళ్లి ప్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శెట్టి రమణ, శెట్టి బాబ్జి, గొల్ల, బాబూరావు, గోవిందు, బాషా పాల్గొన్నారు.