'పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి'

'పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి'

కోనసీమ: సోలార్ విద్యుదీకరణ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ఎమ్మెల్యే ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు అందరూ పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.