VIDEO: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
VSP: తగరపువలసలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఓ మహిళను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.