లక్ష్మీపురం జాతర రూట్ మ్యాప్ విడుదల
KMM: స్నానాల లక్ష్మీపురం సోమలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఎస్సై రామారావు రూట్ మ్యాప్ విడుదల చేశారు. తల్లాడ వైపు వారు గండగలపాడు మీదుగా, పినపాక వారు కేజీ సిరిపురం పార్కింగ్ వద్దకు చేరుకోవాలి. తాటిపూడి భక్తులు ముసలిమడుగు వద్ద వాహనాలు నిలపాలని సూచించారు. నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.