'కలెక్టర్‌ను కలిసిన ఉండి ఎమ్మెల్యే'

'కలెక్టర్‌ను కలిసిన ఉండి ఎమ్మెల్యే'

W.G: పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన చదలవాడ నాగరాణినీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూల కుండీ అందించారు. అనంతరం ఉండి నియోజకవర్గ పరిస్థితులను కలెక్టర్‌కు ఎమ్మెల్యే వివరించారు. జిల్లా ప్రజలకు పరిపాలనలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు.