'గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతుంది'
KNR: జిల్లాలో గృహ గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జిల్లా పౌర సరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు. వినియోగదారులు అధికారికంగా ఇండేన్, భారత్, హెచ్పీ గ్యాస్ నంబర్ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.