మార్కెట్‌లో క్వింటా తేజ మిర్చి ఎంతంటే..?

మార్కెట్‌లో క్వింటా తేజ మిర్చి ఎంతంటే..?

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం తేజ మిర్చి క్వింటాకు రూ.19,000 అత్యధిక ధర పలికింది. ఈ నెల 20న రూ.18,000 ఉన్న తేజ మిర్చి, ఈ నెల 24న 18,300, 25న 18,400, 26న రూ.18,700 ధర చొప్పున పెరుగుతూ ఈరోజు క్వింటాకు రూ.19,000 ధర పలికింది. వారం రోజుల్లో రూ.వేల ధర పెరగడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.