'సెప్టెంబర్ 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ'

'సెప్టెంబర్ 1 నుంచి  రేషన్ బియ్యం పంపిణీ'

KMR: సెప్టెంబర్ 1 నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు మద్నూర్ తహశీల్దార్ ఎండీ ముజిబ్ గురువారం తెలిపారు. నూతనంగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు కూడా ఈ బియ్యం పంపిణీకి అర్హులని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.