VIDEO: బాలుడి కిడ్నీ నుంచి రాయి తొలగింపు

VIDEO: బాలుడి కిడ్నీ నుంచి రాయి తొలగింపు

ADB: ఓ బాలుడి కిడ్నీ నుంచి 200 గ్రాముల రాయిని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు తొలగించారు. సిరికొండ మండలం పాలవాగు చెందిన కోట్నక్ లింగు (12) కిడ్నీ నొప్పితో బాధపడుతున్నాడు. 3 రోజుల కింద అతడికి కిడ్నీ నొప్పి రావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. యూరాలజీ వైద్యుడు కార్తీక్ కుమార్ అతడిని పరిశీలించి, ఆపరేషన్ చేసి రాయిని తొలగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.