VIDEO: 'పారిశుద్ధ్య సమస్యల పట్ల అలసత్వం వద్దు'

VIDEO: 'పారిశుద్ధ్య సమస్యల పట్ల అలసత్వం వద్దు'

ప్రకాశం: పారిశుద్ధ్య సమస్యలపై మున్సిపల్, సచివాలయ సిబ్బంది అలసత్వం వహించవద్దని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ సూచించారు. పారిశుధ్య సమస్యలపై స్థానికుల ఫిర్యాదు మేరకు కనిగిరి‌లోని శివనగర్ కాలనీలో ఆదివారం ఆయన పర్యటించారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువలను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.