పింఛన్ తొలగింపు దారులకు మరో అవకాశం

KRNL: మద్దికేర మండలంలో పింఛన్ తొలగింపు దారులకు ప్రభుత్వం అప్పీలు చేసే అవకాశం కల్పించిందని డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి పెర్కొన్నారు. మొత్తం 73 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో అప్పీలు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.