ఎమ్మెల్యేలకు 10 శాతం కమీషన్..!

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడమే కాకుండా.. వారి వారి ఎమ్మెల్యే నిధుల నుంచి పది శాతం కమీషన్ కూడా పొందుతారని బీజేపీ ఎమ్మెల్యే మహేష్ త్రివేది అన్నారు. కాన్పూర్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.