లావేరు గ్రంథాలయంలో 'చదవడం మాకిష్టం' కార్యక్రమం
SKLM: లావేరు శాఖా గ్రంధాలయములో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ నేర్చుకోవాలని తద్వారా భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తయారవుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కథలు చెప్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు వీరభద్రుడు, విద్యార్థులు ఉన్నారు.