పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు పరిశీలించిన ఎస్పీ నరసింహ
SRPT: మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న సూర్యాపేట మండలం బాలెంల, యార్కారం గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నర్సింహా అధికారులతో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకున్న చర్యలను ఏర్పాట్లను పరిశీలించి విధులు నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల సామాగ్రికి అధికారులకు భద్రత కల్పించాలని ఆదేశించారు.