వంతెన నిర్మాణానికి రాస్తారోకో

వంతెన నిర్మాణానికి రాస్తారోకో

GDWL: ధరూర్ మండలం రేవులపల్లి-నందిమల్ల వద్ద వంతెనను పాత జీవో ప్రకారం నిర్మించాలని డిమాండ్ చేస్తూ రేవులపల్లి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జూరాల హైలెవల్ డ్యామ్ వద్ద ఇవాళ రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో ఆత్మకూరు-గద్వాల మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.