'ప్రజావాణిలో 3 దరఖాస్తుల స్వీకరణ'
KNR: జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 3 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ వెంకట్ రెడ్డి తెలిపారు. 2 దరఖాస్తులు ప్రజాపాలనకు సంబంధించినవి కాగా, మరొక దరఖాస్తు భూమి సమస్య దరఖాస్తు అని పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఎంపీడీవో పద్మావతి పాల్గొన్నారు.