'ఆదివాసీల భూములకు రక్షణ కల్పించాలి'

SKLM: ఆదివాసీల భూములకు రక్షణ కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేశారు. జలుమూరు మండలం మరివలస పంచాయతీ పరిధి ఎస్టీ మాకివలస (డి) గ్రామస్తులు సోమవారం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ముందుగా జలుమూరు బస్టాండ్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ నాగమ్మ మాట్లాడుతూ.. గిరిజనులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.