గుల్లకోట హెడ్‌మాస్టర్‌కు రాష్ట్ర స్థాయి సన్మానం

గుల్లకోట హెడ్‌మాస్టర్‌కు రాష్ట్ర స్థాయి సన్మానం

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చందూరి రాజిరెడ్డి ఉత్తమ పనితీరుకు రాష్ట్ర విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ చేత సన్మానం అందుకున్నారు. బడిబాట ద్వారా 182 మంది విద్యార్థుల నమోదు, డిజిటల్ విద్య, దాతల సహకారంతో వసతుల అభివృద్ధి, వినూత్న బోధనతో పాఠశాలను ప్రత్యేకంగా నిలిపినందుకు ఈ గుర్తింపు లభించింది.